![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -1007 లో.....స్వాతి తను కిడ్నాప్ చెయ్యమన్న వాళ్లకి ఫోన్ చేస్తుంది. కిడ్నాప్ గురించి మాట్లాడుతుంది. మేమేం మీ అక్కని కిడ్నాప్ చెయ్యలేదు.. ఎవరో పొగపెట్టారు అందరిలాగే మేము కూడా పడిపోయాం.. లేచి చూస్తే మీ అక్క లేదని తెలిసింది. దాంతో అక్కడి నుండి పారిపోయామని అతను చెప్తాడు. అయితే మా అక్కని కిడ్నాప్ చేసింది ఎవరు అని స్వాతి టెన్షన్ పడుతుంది. వెనక్కి తిరిగిచూసేసరికి అపర్ణ ఉంటుంది. తనని చూసి స్వాతి షాక్ అవుతుంది. ఇక స్వాతి చెంప చెల్లుమనిపిస్తుంది అపర్ణ.
మరోవైపు రాజుకి వాళ్ళ నాన్న ఫోన్ చేసి మీ ఫ్రెండ్ సాహో ఏదో లెటర్ పంపాడురా.. అందులో మీ తమ్ముడికి ఏం కాకూడదని పూజ చేసానని ఉంది.. ఎందుకు వాడితో ఇదంతా చేపిస్తున్నావని వాళ్ళ నాన్న అంటాడు. పది లక్షలు ఇవ్వకపోతే తన ఫ్యామిలీని ఆ రౌడీ ఏదైనా చేస్తాడేమోనని రాజుకి టెన్షన్ మొదలవుతుంది. ఇక ఆలస్యం చెయ్యకుండా ఆ ఇందు దగ్గరికి వెళ్లి మన పర్ఫామెన్స్ తో మనకి సపోర్ట్ చేసేలా చేద్దామని లక్కీతో రాజు అంటాడు. ఇందు దగ్గరికి రాజు వాళ్ళు వెళ్తారు. ఇక ఇందు కట్లు విప్పి.. మేం నిన్ను కిడ్నాప్ చేసింది తప్పే కానీ మాకు వేరే దారి లేదు అంటూ ఏదో స్టోరీ అల్లుతారు కానీ ఇందు నమ్మదు.. ఇక ఇద్దరిని చీపురుకట్ట తిరిగేసి కొడుతుంది. దాంతో ఇందుని లోపలే ఉంచి బయట గడియపెట్టి వెళ్ళిపోతారు రాజు, లక్కీ. ఆ తర్వాత స్వాతితో అపర్ణ మాట్లాడుతుంది. మీరు ఇలా కిడ్నాప్ గురించి నిర్ణయం తీసుకున్నప్పుడు నాకు చెప్పాలి కదా అని అపర్ణ అంటుంది. సంతకం పెట్టకుండా తప్పించుకోవడానికి అక్క అలా చేసింది కానీ అక్కని ఎవరో కిడ్నాప్ చేశారని అపర్ణతో స్వాతి చెప్తుంది. అదంతా నందు వింటుంది.
అక్క ఎక్కడున్నా నేను తీసుకొని వస్తాను.. మీరు కంగారుపడకండి అని నందు మాటిస్తుంది. ఆ తర్వాత భ్రమరాంబతో అన్ని పనులు చేపిస్తుంది నందు. అప్పుడే రేఖకి రాజు ఫోన్ చేసి డబ్బు కావాలని బ్లాక్ మెయిల్ చేస్తాడు. మీరు అలాగే మాట్లాడుతూ ఉండండి అని నందు చెప్తుంది. ఫోన్ ట్రేస్ చేస్తుంటే ఐశ్వర్య టెన్షన్ పడుతుంది. రేఖ దగ్గర నుండి భ్రమరాంబ ఫోన్ తీసుకొని మీరు ఇందుని పంపించండి తను వస్తేనే డబ్బు వస్తుంది. ఆ తర్వాత నీకు పంపిస్తామని భ్రమరాంబ అనగానే మీకు ఇలా కాదు మీ అమ్మాయి వేళ్ళు కట్ చేసి పార్శిల్ పంపిస్తున్నామని రాజు అనగానే అపర్ణ భయపడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |